NTV Telugu Site icon

Bhandi Sanjay: బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు.. కారణం ఇదీ..

Bandi Sanjay

Bandi Sanjay

Bhandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దైంది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించునున్నారు.

తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఏపీ పార్టీ వ్యవహారాలను తీసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్‌ను పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తొలగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ నియమితులయ్యారు. ఏపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా బండిని నియమిస్తారని ప్రచారం జరుగుతుండగానే సంజయ్ ఈ నెల 21న ఏపీకి పర్యటన సంచలనంగా మారింది.. బండి సంజయ్ ఈ నెల 21న విజయవాడ పర్యటనకు వెళుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించనున్నట్లు తెలిపారు. కాగా.. ఐదు రాష్ట్రాల ఓటర్ల నమోదు ప్రక్రియ బాధ్యతలను పార్టీ నాయకత్వం ఆయనకు అప్పగించింది. మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఏపీలో బండిసంజయ్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఏపీకి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో ఓటరు నమోదుకు బాధ్యత వహిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ నియమితులయ్యారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

Read also: Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్‌ హెడ్‌తో బోగస్‌ సిఫార్స్‌ లేఖ

అయితే జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, టీడీపీల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీతో పొత్తు అక్కర్లేదని నేతలు బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా ప‌నిచేసిన సునీల్ దేవ‌ధ‌ర్‌ను పార్టీ వీడింది. ఇప్పుడు ఆయన స్థానంలో బండి సంజయ్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. దీని ద్వారా అటు తెలంగాణ, ఇటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. పొత్తు రాజకీయాలు జరుగుతున్న తరుణంలో.. సొంతంగా పార్టీని ఎదగాలని భావిస్తున్న బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పలు కారణాల వల్ల పర్యటన రద్దుకావడంతో కీలకంగా మారింది. అయితే ఇవాళ మధ్యాహ్నం వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ ఏం మాట్లాడనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
SIM Cards: మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసా?.. చెక్‌ చేసుకోండి ఇలా!