NTV Telugu Site icon

Hyderabad:జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని ద‌ర్శించుకున్న బండి సంజ‌య్‌

Bandi Sanjy

Bandi Sanjy

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. అమ్మవారి కరుణ, కటాక్షం కలిగించించే అవకాశం కల్పించిన స్వర్గీయ PJR గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలు ఏం మాట్లాడాల్సి వచ్చినా PJR లేకుండా మాట్లాడలేమని అన్నారు. అంతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని ఎంపీ అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర 2 వ విడత పాదయాత్రలో.. 31 రోజుల్లో 383km పూర్తి చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఎర్ర టెండలో పాదయాత్ర చేశామని గుర్తు చేసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విజవంతం చేసినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని అన్నారు. అమిత్ షా సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లో ఒక స్పష్టత వచ్చిందని వివరించారు. ఉచిత విద్య, వైద్యం అనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజల నుంచి పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నామని పేర్కొన్నారు.

చాలా పేదరికంతో ఎంతోమంది గుడిసెల్లో జీవిస్తున్నారని, లక్షల మందికి ఇండ్లు కూడా లేని పరిస్థితి వుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే…నిలువ నీడలేని అర్హులైన పేదలందరికి ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రావాలని పేదలందరు కోరుకుంటున్నారని అన్నారు.

Andhra Pradesh: ఉపాధ్యాయులకు ఈనెల 22 వరకు సెలవులు రద్దు