Site icon NTV Telugu

2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం : బండి సంజయ్

సీఎం కేసీఆర్‌ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలని… ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తాడని నిప్పులు చెరిగారు. దళితబంధు పేరుతో మరోసారి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని… 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీవ్ర అన్యాయమన్నారు. పాలన గాలికొదిలేసి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని… కరోనా సమయంలో బీజేపీ మాత్రమే ప్రజలకు అండగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు చేశారు బండి సంజయ్.

Exit mobile version