Site icon NTV Telugu

Bandi sanjay: వారికి మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay Bjp

Bandi Sanjay Bjp

Bandi sanjay: ప్రజల్లో ఉంటూ, నిత్యం ఓటర్లను కలిసే వారికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావచ్చని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాల నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు ఇస్తామని ప్రకటించారు. పార్టీలో క్రమ శిక్షణతో ఉండాలని సూచించారు. ప్రజల్లో ఉంటూ, నిత్యం ఓటర్లను కలిసే వారికే గుర్తింపు అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. వారికి మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావచ్చని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామ రాజ్యం రావాలని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను నీరుగారుస్తున్నరని అన్నారు. కేంద్రంలో, యూపీలో బీజేపీ సర్కార్ లు ఉన్నాయి కాబట్టి అక్కడ పథకాలు బాగా అమలు అవుతున్నాయని అన్నారు. అయుష్మన్ భారత్ నిధులను దారి మళ్ళిస్తుంది కేసీఅర్ సర్కార్ అంటూ ఆరోపించారు. తెలంగాణలో మిషన్ భగీరథ పెద్ద స్కాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Bihar: ప్రేమకోసం జైలు కెళ్లాడు.. కోర్టుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు

ఆ స్కీమ్ ఇప్పటికీ సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే స్కీమ్ లు బాగా అమలు అవుతాయని అన్నారు. కేంద్రానికి, మోడీకి మంచి పేరు వస్తుందని స్కీమ్ లను కేసీఅర్ అమలు చేయడం అన్నారు. కేసీఅర్ విశ్వాస ఘాతకుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ నాయకులు ఫోన్లు ఎత్తలేదని, కాంగ్రెస్ కు ఫండ్ ఇచ్చారు కేసీఅర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలంగాణకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి కేసీఅర్ ఫండింగ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుంది ? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కి పోటీ బీజేపీ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ ను లేపెందుకు కేసీఅర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందని అన్నారు. మాయ మాటలు చెప్పేందుకు 21 రోజులు కేసీఅర్ కార్యక్రమాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానం

Exit mobile version