NTV Telugu Site icon

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్మదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని అన్నారు. కేసీఆర్ కి ప్రజాస్వామ్యం పై నమ్మకంలేదు… కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పోరాటం తర్వాత… ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ ని బొంద పెడదామన్నారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ వాళ్లు ఓ కన్నేసి ఉంచండి అంటూ హాట్ కామెంట్.. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎక్కువ సంఖ్యలో ఎంపీలు గెలవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావలన్న బీజేపీ గెలవాలన్నారు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చింది కేసీఆర్ అంటూ మండిపడ్డారు. యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మ చెక్కించుకున్నాడని గుర్తుచేశారు. మోడీ అయోధ్య లో తన బొమ్మ కానీ అయోధ్య చుట్టుపక్కల భూములు కొనుక్కోలేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధార్మిక కేంద్రాన్ని వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు.

Read also: Export Ban : గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై నిషేధం ఎత్తివేత కుదరదు

కాంగ్రెస్ వారు అయోధ్య ప్రారంభ కార్యక్రమానికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. భద్రాద్రి రామయ్య కల్యాణానికి తలంబ్రాలు తీసుకుపోలేదు కేసీఆర్ అన్నారు. వేములవాడ 100 కోట్లు అన్నారు.. రాజన్న ఆలయానికి ఉన్న నిధులను ఇతర ప్రాంతాలకు మల్లించాలని చూసారని ఆరోపించారు. బీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని వదులుకుంది… అది ప్రాంతీయ పార్టీనా.. జాతీయ పార్టీనా? అని ప్రశ్నించారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలని అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే నిధులు ఎక్కువగా వస్తాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊసు ఉండదు.. పోటీకి అభ్యర్థులు ముందుకు రావడంలేదన్నారు. కాంగ్రెస్ నేతలు మొండి పట్టు వీడి బీజేపీ ఎంపీలు ఎక్కువ గెలవాలని కోరుకోండన్నారు. మీరు మేము కలిసి కేంద్రం నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ కాపాడుకోవాలని బండి సంజయ్ సూచించారు.
Komaram Bheem: పులి దాడిలో పశువులు చనిపోతే రూ.5 వేలు.. అటవీశాఖ అధికారులు ప్రకటన