Site icon NTV Telugu

Bandi Sanjay: మా ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: మేం మోడి ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఓట్ల కోసం కాదు, భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నాం. ఆసరా పెన్షన్లు ఎవరి అకౌంట్లో ఐనా పడినాయా? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే, కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడిలోపలి లింగాన్ని మింగే రకం అన్నారు. ప్రజల కోసం మేం పోరాడితే, మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై, ప్రజలకు తెలియని అభ్యర్థికి పోటీలో నిలపడానికి ప్రయత్నిస్తుందన్నారు.

Read also: Rinku Singh Virat Kohli: ‘ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యి ప్లిజ్’.. వీడియో వైరల్..

కోవిడ్ సమయంలో ప్రజల కోసం మేం తిరిగామన్నారు. రైతులకు నష్టపరిహారం కోసం నేను పోరాడానని తెలిపారు. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు 2500 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. నేను దీక్ష చేస్తానని భయపడి, నేతన్నల బకాయి 50 కోట్లు విడుదల చేశారు. మిగితా డబ్బులు కూడా విడుదల చేయాల్సిందే అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ను టిఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. టిఆర్ఎస్ లాగే వ్యవహరిస్తే, కాంగ్రెస్ కూడా పుట్టగతులు లేకుండా పోతుందన్నారు. యార్న్ సబ్సిడీ, యాబై శాతం విద్యుత్ సబ్సిడి వస్త్ర పరిశ్రమకు ఇవ్వాలన్నారు.

Read also: Raghunandan Rao: రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కోసం కేసులకు, జైలుకు భయపడకుండా పోరాడుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి, కేటీఆర్ లు మంచి దోస్తులు. దోస్తానా లేకపోతె బతుకమ్మా చీరలపై స్కాంపై విచారణ చేపించు అంటూ సవాల్ విసిరారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు ఊర్లలోకి వేస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలను జైళ్లలో పెట్టారన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు పని చేసిన పార్టీ బీజేపీ అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ మోడీ అంటున్నారని తెలిపారు. మేం మోడీ ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టే, బిఆర్ఎస్ కు ఓటేసే వారు లేరన్నారు.
Kishan Reddy: మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేం..

Exit mobile version