Bandi Sanjay: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఎలా వచ్చింది? కరీం నగర్ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సమక్షంలో పలువురు సినీ, టీవీ ఆర్టిస్టు లు బీజేపీలో చేరారు. కేసీఆర్ కొడుక్కు తెలియకుండానే సిరిసిల్ల కేంద్రంగా పోన్ ట్యాపింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు… అధికారిక ప్రకటన ఎందుకు చేయడం లేదు? అన్నారు.
Read also: Rajamouli : ఆ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి..?
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసు అని అన్నారు. అమెరికా ప్రభాకర్ రావు అశోక్ రావు కూతురు ఇంట్లో ఉంటాడన్నారు. కాంగ్రెస్ వాళ్ళ నుండి డబ్బులు తీసుకోవడానికి భయపడుతున్నారు కరీంనగర్ లో అన్నారు. 6 గ్యారంటీ లు, పోన్ ట్యాపింగ్ విషయం లో ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుందన్నారు. నయీం కేసు లెక్కనే ఈ కేసు కూడా క్లోజ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని నుండి బయటపడేందుకు రిజర్వేషన్ అంశం తీసుకొచ్చారన్నారు. కరీం నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కి టికెట్ ఎలా వచ్చింది? మంత్రి కి కెసిఆర్ కుటుంబం కు ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటని అన్నారు.
Read also: Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..
ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం అన్నారు. కరీంనగర్ మంత్రి డిల్లి పెద్దలకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డీ ఢిల్లి ఆదేశాల మేరకు నడవాలి కదా? ఆయన చర్యలు తీసుకోలేడన్నారు. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ నడుస్తుందన్నారు. ఎవరి ఏమీ చేసిన తెలంగాణ లో మెజారిటీ సీట్లు సాధించేది బీజేపీ నే అన్నారు. కరీంనగర్ అభ్యర్థి కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదన్నారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావు .. అశోక్ రావు ఇంట్లో ఉండి ప్రభాకర్ రావు పోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపాడన్నారు.
Read also: Amit Shah deepfake video: జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
ఈ అశోక్ రావే కరీం నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారు అన్నారు. అశోక్ రావు ఇంట్లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నారని తెలిపారు. కరీంనగర్ మంత్రి అశోక్ రావు నీ సీఎం కి పరిచయం చేశాడన్నారు. రాజేందర్ రావు టికెట్ రావడానికి ప్రధాన కారణం ప్రభాకర్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రభాకర్ రావు డబ్బులు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన వారికి టికెట్ రాలేదని అంటే ఎంత తతంగం జరిగిందో అన్నారు. ఇదంతా సీఎం కి తెలుసా? అని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ కి చందా ఏమన్నా ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
Etela Rajender: మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు.. డొక్కు బస్సులతో నడిపిస్తున్నారు
