Bandi Sanjay Sensational Comments On CM KCR: పేదోళ్లకు పువ్వు గుర్తు అయితే.. కారు, చెయ్యి గుర్తులు పెద్దోళ్ల కోసమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లా ఆలేరులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మూర్ఖుత్వం వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారికి భరోసా ఇవ్వడానికే ప్రజల వద్దకు వస్తున్నామని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉన్నా.. అభివృద్ధి పనులు చేసిందేమీ లేదని విమర్శించారు. హాస్పిటల్‌లో బెడ్‌లు కూడా లేవని దుయ్యబట్టారు. స్టేషన్ ఘణపూర్‌లో డిగ్రీ కళాశాల లేదన్నారు. ఇంటింటికి నీళ్లు అని ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పైపుల కంపెనీలు పెట్టుకున్నారని.. నీళ్లు లేవు గానీ, బెల్టు షాపులు ఉన్నాయని ఆరోపించారు. ఘనపూర్‌లో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ సర్కార్ చెప్తోందని.. 24 గంటల కరెంట్ ఇస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
KTR: మినిస్టర్ KTR లాంచ్ చేసిన “భీమదేవరపల్లి బ్రాంచి” సినిమా టీజర్
డీసీ తండాలో కరెంట్ బకాయిలు ఉన్నాయని 6 నెలల నుండి కరెంట్ కట్ చేశారన్న బండి సంజయ్.. కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో మాత్రం 24 గంటల కరెంట్ ఉంటోందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో నెలకు రూ.24 లక్షలు జీతాలు వస్తున్నాయన్నారు. లెదర్ పార్క్ పెడితే ఎంతోమందికి ఉపాధి లభించేదన్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని తాను తెరపైకి తీసుకొచ్చాను కాబట్టి, రేపోమాపో శంకుస్థాపన చేస్తారని ఎద్దేవా చేశారు. మోడీ సర్కార్ 2 లక్షల 40 వేల ఇళ్లు ఇచ్చిందని.. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క డబుల్ బెడ్‌రూమ్ కూడా ఇల్లు కట్టలేదని వ్యాఖ్యానించారు. దళిత బందు పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఏ పథకం అడిగినా కేసీఆర్ డబ్బులు లేవంటున్నారని.. ఆయన బిడ్డకేమో దొంగ సారాదందా, డ్రగ్స్ దందా చేయడానికి కోట్ల డబ్బులు వస్తున్నాయని ఆరోపణలు చేవారు. తెలంగాణ కొసం శ్రీకాంత చారి, సుమన్, పోలీస్ కిష్టయ్య చనిపోయారని.. పేదోడు చనిపోతే పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఒక పాస్ పోర్ట్ బ్రోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Nalgonda Crime: నవీన్ హత్య కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రీతి అనే అమ్మాయి చావుబ్రతుకుల మధ్య పోరాడుతుంటే, కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని.. కొండగట్టు ఆక్సిడెంట్‌లో చనిపోయిన వారిని కూడా పరామర్శించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. పువ్వు గుర్తు గెలిస్తే, పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. కొవిడ్ సమయంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్ వల్లే అందరు బతికున్నామని పేర్కొన్నారు. రేషన్ బియ్య, బాత్‌రూమ్, పెన్షన్ లాంటి పైసలు మోడీ ఇస్తే.. కేసీఆర్ వాటిని దారి తప్పించారన్నారు. మోడీ పాలన వస్తే.. ఒక్క సంవత్సరంలోనే 70 వేల ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చారు. నష్టపోయిన రైతులకు కేసీఆర్ ఆరు సంవత్సరాల నుండి ఒక్క పైసా ఇవ్వలేదని, మోడీ ఫసల్ బీమా ఇస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరిపై కేసీఆర్ లక్ష ఇరవై వేలు అప్పు చేశారని, జీతాలు సమయానికి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. పేదోళ్ల రాజ్యం రావాలి.. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.