మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మూడో విడత విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుంచి ప్రారంభం అవుతుంది. యాదాద్రి నుండి భద్రకాళి దేవాలయం వరకు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్ట్ 2 నుండి 20 రోజుల పాటు సంజయ్ సంగ్రామ యాత్ర సాగుతుంది. సంగ్రామ యాత్ర పై పాద యాత్ర కమిటీ తో భేటీ అయ్యారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సీఎం మాత్రం బయటకు రాడు. రుణమాఫీ చేయక పోవడంతో రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రైతులు పంటలు వేసుకునేందుకు సిద్దంగా ఉన్న…రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల… వ్యవసాయం చేయాలా వద్ద అయోమయంలో ఉన్నారన్నారు. బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టలేదు. రెండు పంటలకు కేంద్రం ప్రతి ఎకరానికి 27 వేలు ఎరువుల సబ్సిడీ ఇస్తుంది. కేసిఆర్ లక్ష రూపాయల రుణ మాఫీ వెంటనే చెయ్యాలన్నారు. ఈ రోజు వరకు ఇంకా జీతాలు ఇవ్వలేదన్నారు. ఆరా సర్వే ప్రకారం మా ఓటు శాతం 6 నుండి 30 శాతం కు వచ్చామన్నారు. ఇంకో 8 శాతం సాధించడం మాకు పెద్ద ఇష్యూ కాదు..వారం పది రోజులు చాలన్నారు.
కేసిఆర్ కుటుంబం అంతా అవినీతిలో కూరుకు పోయింది. మా కార్యకర్తలు చాలా కష్ట పడుతున్నారు… ఇంకో 15 శాతం ఓట్లు పెరుగుతాయి. రేవంత్ రెడ్డి పేరు మార్చుకుంటా అన్నారని అడిగిన ప్రశ్నపై బండి సంజయ్ స్పందించారు. దీనిపై తానేమీ ఆయనకు పేరు పెట్టలేదన్నారు. మేం కాంగ్రెస్ ను కౌంట్ లోకి తీసుకోము… కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యారు… వాళ్ళను అరెస్ట్ చేయరు.. కలిసే పోటీ చేస్తారని విమర్శించారు. ఈ సందర్భంగా పలు చేరికలు జరిగాయి. బీజేపీలో చేరారు కోరుట్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహిపాల్ రెడ్డి. మహిపాల్ రెడ్డి తో పాటు ఆయన మిత్ర బృందం బీజేపీ కండువా కప్పుకున్నారు.
Bhatti Vikramarkha: యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి
