బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి.. వడ దెబ్బకు గురైన బండి సంజయ్.. తన పాదయాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారని వాటి సారాంశం.. అయితే, దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.. బండి సంజయ్ రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది… ప్రజా సంగ్రామ యాత్ర యథావిథిగా కొనసాగుతుందని ప్రకటించింది.. ఈ రోజు మక్తల్‌లో జరిగే బహిరంగ సభ అనంతరం రాత్రి బస చేసే శిబిరం నుండే రేపు యథావిథిగా పాదయాత్ర ప్రారంభకానుందని క్లారిటీ ఇచ్చింది.
Read Also: TS Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 16,027 పోస్టులకు నోటిఫికేషన్ జారీ
అయితే, గత 12 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేయడంవల్ల బండి సంజయ్ వడ దెబ్బకు గురయ్యారు.. దీనికితోడు ఎసిడిటీ సమస్య తోడవడంతో అస్వస్థతకు లోనయ్యారని ఓ ప్రకటనలో పేర్కొంది తెలంగాణ బీజేపీ.. బండి సంజయ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయన ఆరోగ్య రీత్యా పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారని.. కానీ, బండి సంజయ్ మాత్రం పాదయాత్ర కొనసాగించడానికే మొగ్గు చూపారని.. ఈ నేపథ్యంలో పాదయాత్ర యథావిథిగా కొనసాగిస్తారని.. సమాచార లోపం వల్ల మాత్రమే పాదయాత్రకు రెండ్రోజులు విరామం ఇస్తున్నట్లు పొరపాటుగా వెలువరించడం జరిగినట్టు క్లారిటీ ఇచ్చింది.