Bandi Sanjay On Teacher MLC Elections: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం టీచర్లకే పరిమితం కావని, ఇవి తెలంగాణ ప్రజల తలరాతనే మార్చే ఎన్నికలు కానున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ప్రజలు పీక పిసికి చంపుతారా? లేక కాపాడుకుంటారా? అనేది మీరే ఆలోచించుకోండని చెప్పారు. బండి సంజయ్ అఫ్ట్రాల్ ఒక కార్పొరేటర్ మాత్రమే.. ఆయన్ను అధ్యక్షుడు చేస్తే ఏమవుతుందని ట్విటర్ టిల్లు కేటీఆర్ అన్నాడని మండిపడ్డారు. తన తండ్రి ఉపాధ్యాయుడని, తాను సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని, తాను ఏనాడూ తన తండ్రి పేరు చెప్పుకొని రాలేదని, మీ అయ్య లేకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా దేఖవని కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చిప్పలు కడిగొచ్చిన మీకు, నా క్యారెక్టర్‌కు పొంతనా? అని ప్రశ్నించారు.
Pakistan Suicide Bomber: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసులు మృతి
బీఆర్ఎస్ మరోసారి గెలిస్తే తమ బ్రతుకులంతా ఆగమవుతాయని తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని.. తాను ఎక్కడిపోయినా ప్రజలంతా ఇదే మాట చెప్తున్నారని బండి సంజయ్ తెలిపారు. మీకు మొదటి తారీఖు నాడు జీతాలు వస్తేనే ఓటు వేయండని పిలుపునిచ్చారు. ఎన్నికలున్న జిల్లాల్లో (మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్) మాత్రమే ఫస్ట్ తారీఖున కేసీఆర్ జీతాలు ఇస్తున్నాడని, బీజేపీ మాట్లాడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఉపాధ్యాయ సంఘాలు తమకు శత్రువులు కాదని, కేవలం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేవాళ్లు మాత్రమే తమకు శత్రువులని చెప్పారు. ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే.. సర్కార్ మెడలు వంచి పీఆర్సీని వేసేలా పోరాడుతామన్నారు. ఏవీఎన్ రెడ్డికి ఓటేయకపోతే.. చారిత్రక తప్పిదం చేసిన వాళ్లవుతారన్నారు. ఆయన్ను గెలిపించకపోతే.. టీచర్ల సమస్యలపై ప్రశ్నించే వాళ్లు మిగలరన్నారు. ఫస్ట్ తేదీన జీతాలు రావాలంటే.. ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని, 317 జీవో సహా టీచర్ల సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు.
Tamilisai Sounderajan: నన్ను తిట్టిన వారికి అవార్డులిచ్చారు.. గవర్నర్ ధ్వజం
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని.. జీతాలు ఇవ్వకపోవడం వల్లే ఏవీఎన్ రెడ్డిని గెలిపించారని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసే.. ఉద్యోగ సంఘాలను పిలిచి.. ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. మిమ్మల్ని మళ్లీ లోబర్చుకునేందుకు, ఆశ పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఇక హిందుత్వం గురించి తాను బరాబర్ మాట్లాడుతానని.. హిందుత్వం గురించి మాట్లాడినంత మాత్రం ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.