NTV Telugu Site icon

Bandi Sanjay: తుగ్లక్ నిబంధనలతో.. పోలీసు అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతోంది

Bandi Sanjay T Govt

Bandi Sanjay T Govt

Bandi Sanjay Kumar Fires On Telangana Govt Over Police Recruitment Rules: తుగ్లక్ నిబంధనలతో తెలంగాణ సర్కార్ పోలీసు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ (టీఎస్ఎల్‌పీఆర్) బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. బోర్డు నిర్వాకంతో లక్షలకు పైగా అభ్యర్తులు అర్హత కోల్పోయారని మండిపడ్డారు. పోలీసు నియామకాలకు సంబంధించి పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను సవరించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం ముమ్మాటికీ తప్పేనన్నారు. ఇదే విషయంపై తాను బహిరంగ లేఖ రాశానని, అయినప్పటికీ తెలంగాణ సర్కార్ ‘దున్నపోతుపై వాన పడ్డట్టు’ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Houses are not sold : ఇకపై ఆ దేశంలో ఫారెనర్స్‎కు ఇళ్లు అమ్మరట

పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల నిర్వహణలో లోపాలు, దేహదారుడ్య పరీక్షల నిబంధనలు వెంటనే సరిదిద్దాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు కరీంనగర్‌లో బండి సంజయ్‌ని కలిసి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, పాత నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించేలా చేయాలని కోరారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగార్ టీఎస్ఎల్‌పీఆర్ బోర్డు నిర్వహించినట్లు అభ్యర్థులు నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. లాంగ్ జంప్, షార్ట్‌పుట్ పరీక్షల్లో.. ఏ రాష్ట్రంలోనూ లేని నిబంధనల్ని ఈ బోర్డు పొందుపరిచిందని విమర్శించారు. ఆర్మీ రిక్రూట్మెంట్‌లో కూడా ఈ స్థాయి నిబంధనలు లేవన్నారు. ఈ నిబంధనల వల్ల దాదాపు లక్ష మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపలున్నాయని పేర్కొన్నారు.

Reshma Pasupuleti: తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. తట్టుకోలేకపోయిందట

తెలంగాణ సర్కార్ చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురదృష్టకరమని బండి సంజయ్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. దేహదారుఢ్య పరీక్షల్లోనూ కొత్త నిబంధనలు పెట్టి, అభ్యర్థులను డిస్‌క్వాలిఫై చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అనేక రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు మాత్రమే ఉండగా.. తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంలో ఉన్న శాస్త్రీయత ఏంటని ప్రశ్నించారు. లాంగ్ జంప్‌తో పాటు షార్ట్‌పుట్ విషయంలో పాత విధానాల్నే అమలు చేయాలని కోరారు. ఇప్పటికై నిబంధనల్ని సవరించకపోతే.. ఈ ప్రభుత్వాన్ని యువత క్షమించదని బండి సంజయ్ హెచ్చరించారు.