Site icon NTV Telugu

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ పచ్చి అబద్దాలు..!

Bandi-Sanjay

Bandi-Sanjay

దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ పలు అంశాలపై స్పందించారు… అయితే, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను అవమానిస్తారా? అంటూ ఫైర్ అయిన ఆయన.. సీఎం సోయిలో లేకముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన… ఉద్యోగాల కల్పనపైనా సీఎం మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని కొట్టిపారేశారు. ఇక, రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు బండి సంజయ్‌.. మరో 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది నిజం కాదా? అంటూ ఫైర్ అయిన ఆయన… చిత్తశుద్ది ఉంటే శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version