Site icon NTV Telugu

Bandi Sanjay: ఇక రజాకార్‌ ఫైల్స్‌.. ఓల్డ్‌ సిటీ ఫైల్స్..

ది కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “ది కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు.. పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయన్నారు.. అయినా, నీకు కాశ్మీర్‌ ఫైల్స్‌ ఎందుకు నచ్చుతాయి.. దోపిడీ దొంగలు లాంటి సినిమాలు నచ్చుతాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారని ఆరోపించిన సంజయ్‌.. బోధన్‌లో బీజేపీ కార్యకర్తలు, హిందువులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Jagga Reddy: రేవంత్‌రెడ్డి ఇచ్చుడు కాదు.. నేనే ఝలక్‌ ఇస్తా..

కేసీఆర్ ఎంతమంది రాజకీయ వ్యూహకర్తలు వచ్చినా బీజేపీ ఏం చేయలేరన్నారు బండి సంజయ్‌.. అవినీతి యూపీఏ పాలనలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ భాగస్వామి అని విమర్‌శించిన ఆయన.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తుంటే… కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు.. ఇమ్రాన్ కు ఉన్న బుద్ధి, కేసీఆర్ కు లేదని ఫైర్‌ అయిన ఆయన.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించిన ఘనత కేంద్రానిది అయితే… కేసీఆర్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక మోసకారి, నిత్యం రాజకీయాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.

Exit mobile version