NTV Telugu Site icon

Bandi sanjay: ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా?

Bandi 1 (1)

Bandi 1 (1)

జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ లో బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. టి ఆర్ యస్ రద్దుతో తెలంగాణ కు కెసిఆర్ పీడ పోయిందన్నారు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిండు..ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అని ఆయన ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏం చేసినవో చెప్పాలి. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కేంద్రం రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇచ్చారు కెసిఆర్ డబుల్ బెడ్రూంలు ఇచ్చాడో కేసీఆర్ లెక్క చెప్పాలన్నారు.

Read Also: Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్‌’ విలన్ పెళ్ళి!

హామీలు ఏమి నెరవేర్చావో ముఖ్యమంత్రి చెప్పు.. గుజరాత్ లో ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ముఖ్యమంత్రి బండారం బయట పెడతా. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినవ్ ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నవా? అన్నారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుండే వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడడానికి దేశం వదిలిపోయిన వాళ్ళు వేల కోట్ల డబ్బు కెసిఆర్ కు ఫండ్ ఇచ్చారు. విదేశాలకు పోయి వందల మంది జైళ్లలో మగ్గుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం రావాలన్నారు.

తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలి… డబుల్ ఇంజన్ సర్కార్ కమలం వికాసించాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అందరికి ఉచిత విద్య వైద్యం అందిస్తాం. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తాం. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత మోడీదే అన్నారు బండి సంజయ్. ముత్యం పేట ఘుగర్ ఫ్యాక్టరి మీరు తెరిపిస్తారా మేము తెరిపించాలా కేసీఆర్? అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ గురించి ఒక్క మాట కేసీఆర్ మాట్లాడలేదు.. లండన్ లో తెలంగాణలో కంటేనే కరెంట్ ఉంటుందట. బీజేపీ రాగానే గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం అన్నారు. 30 గ్రామాలకు వాడే కరెంట్ తన ఫామ్ హౌస్‌లో కెసిఆర్ వాడుతున్నారన్నారు. మెట్రో పక్కన తన భూములకు ధరలు రావాలని మళ్ళీ కావాలని అంటున్నాడన్నారు బండి సంజయ్.

Read Also: Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్‌’ విలన్ పెళ్ళి!