NTV Telugu Site icon

Bandi Sanjay: ఎంతమంది చచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ స్పందించరు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Fires On CM KCR And KTR: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ధ్వజమెత్తారు. ఇంత పెద్ద అగ్ని్ప్రమాదం జరిగి, ఎంతమంది చనిపోతున్నా.. మున్సిపల్ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రాకపోవడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటోందే తప్ప.. గతంలో జరిగిన, ఇప్పుడు జరిగిన అగ్నిప్రమాదాలపై కనీసం సమీక్ష కూడా చేయడం లేదని మండిపడ్డారు. సచ్చినోళ్ళకు సంతాపం.. బతికి ఉన్నోళ్లకు పరిహారం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు అని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పొట్టి కూటి కోసం నగరానికి వచ్చి, ప్రాణాలు పోగొట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గమంతా లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత కోసం వెళ్లింది కానీ, ఈ ఘటనపై స్పందించరని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి, మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్

ఇదే సమయంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో నిందితురాలైన రేణుక ఒక బీఆర్ఎస్ నేత కూతురని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వగా.. బీజేపీని బద్నాం చేయాలని చూశారన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గురించి ఆరా తీయకుండానే.. ఎంక్వైరీ చేయకుండానే.. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపించాయని అన్నారు. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేవలం ఈ ఎన్నికల్లో కావు.. అసెంబ్లీ, పార్లమెంట్, ఇంకా ఏ ఎన్నికలొచ్చినా.. తెలంగాణలో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు