Site icon NTV Telugu

Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు

24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు కుక్కల్లా మొరుగుతున్నారు.. ఎంతైనా మొరగండి.. జడ్చర్ల ప్రజలకు న్యాయం చేయండని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పేదలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను కేసీఆర్ ధరణి పేరుతో లాక్కుంటూ నిలవనీడలేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న టీఆర్ఎస్ నేతలు.. గుంట నక్కల్లా ఇసుక, మట్టి, భూముల దోపిడీ చేస్తూ జనాన్ని పీడిస్తున్నరని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి ఎందుకు ఇవ్వడం లేదని ఇక్కడి కేసీఆర్ ను అడగలేని అసమర్థులు టీఆర్ఎస్ నేతలని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు వరకు జీతాల్లేవు. బ్యాంకులు లోన్లు ఇస్తలేరు. ఆర్టీసీ ఛార్జీలు పెంచినా ఆర్టీసీ కార్మికులకు 5 టీఏలు, 2 డీఏలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ మాత్రం తన కుటుంబంలో ఐదుగురికి పదవులిచ్చి నెలనెలా రూ.25 లక్షల జీతాలు పించన్ గా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? శ్రీకాంతాచారి ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan Kalyan: కర్నూలులో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర

Exit mobile version