NTV Telugu Site icon

Bandi Sanjay: ప్రజలు అన్నదే నేను, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం

Bandi Sanjay, Revanthreddy

Bandi Sanjay, Revanthreddy

Bandi Sanjay: ప్రజలు అన్న మాటలే నేను, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిట్ అంటే సీఎం సిట్ అంటే సిట్… స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ఎద్దేవ చేశారు. అనేక సందర్భాల్లో సిట్ వేశారు.. ఒక సిట్ రిపోర్ట్ ను అయిన బయట పెట్టారా? అంటూ ప్రశ్నించారు. నోటీస్ లు సీఎంకు, సీఎం కొడుక్కు ఇవ్వాలని మండిపడ్డారు. వారు ఏమన్నా చట్టానికి అతీతులా? అంటూ ప్రశ్నించారు. మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు వారికి ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Bollaram President residence: నేటి నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఎంట్రీ

నేను కానీ రేవంత్ రెడ్డి కానీ మాకు ప్రజల నుండి వచ్చిన సమాచారం మాట్లాడుతామని బండి సంజయ్‌ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. మాట్లాడితే నోరు మూస్తం అనే చెప్పేందుకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే భయ పడము అన్నారు. పేపర్ లీకేజీ సర్వసాధారణమని ఓ కబ్జాల మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తి చేశారు. BRS పార్టీ నిద్రావస్థలో ఉందని, సీఎం కేసీఆర్‌ కు మూడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అటుకులు బుక్కి కెసిఆర్ బతుకుతున్నారని, కవిత ఢిల్లీలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయని? ప్రశ్నించారు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ ఆధారాలను తనకు సమర్పించాలని బండి సంజయ్‌ను నోటీసుల్లో కోరారు. మార్చి 24న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ ఇంట్లో బండి లభ్యం కాలేదని సంజయ్ కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వాచ్‌మెన్‌కు చెప్పి.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు.ఇదే అంశంపై రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను చూపించాలని నోటీసుల్లో పేర్కొంది.
Ind Vs Aus : అతడికి విశ్రాంతి..? యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్..!