NTV Telugu Site icon

Bandi Sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. యూపీ తరహా విధానం తెస్తాం

Bandi Sanjay On Preethi Cas

Bandi Sanjay On Preethi Cas

Bandi Sanjay: తెలంగాణలో పూటకో హత్య, గంటకో అత్యాచారం జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మాటలు తప్ప, చేతలు లేవంటూ ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా దీక్ష చేపట్టిన బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు యూపీ తరహా విధానం తీసుకొస్తామన్నారు. బుల్డోజర్స్ తెచ్చి, నిందితుల ఆస్తులను ధ్వంసం చేస్తామన్నారు. మహిళల జోలికి వస్తే పబ్లిక్‌లో శిక్షిస్తామన్నారు. పోలీసులు స్పందించి ఉండుంటే.. మెడికో ప్రీతి ఈరోజు చనిపోయేది కాదన్నారు.

Preethi Case: కేసు విషయంలో అన్యాయం జరుగుతోంది.. ప్రీతి కుటుంబం

ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారని.. ప్రీతి మోబైల్‌లో ఉన్న చాటింగ్‌ని సైతం డిలీట్ చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. చనిపోయిన తర్వాత కూడా.. ప్రీతికి నాలుగు రోజులపాటు ట్రీట్మెంట్ చేసినట్లు చెప్పారని ఆరోపించారు. ప్రీతి కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిమ్స్ ఆస్పత్రి నుంచి శవాన్ని ఎత్తుకుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ తీసుకునే ట్విట్టర్ టిల్లు అయినా.. రోడ్డు మీద తిరిగే రోమియో అయినా.. బీజేపీ ప్రభుత్వం వస్తే ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. కేసీఆర్ కూతురు కవిత పెట్టుకున్న వాచ్ ఖరీదు రూ.20 లక్షలని, మరి ప్రీతి చనిపోతే కేవలం రూ.10 లక్షలే పరిహారమా? అని ప్రశ్నించారు. కవిత వాచ్‌కి ఉన్న విలువ, తెలంగాణ మనుషుల ప్రాణాలకు లేదా? అని నిలదీశారు. రేపిస్టులంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఆరోపించిన ఆయన.. పెద్ద సంఘటనలు జరిగినప్పుడు, వాటిని చిన్న సంఘటనలుగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు.

DK Aruna: ప్రీతి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.. నిజానిజాలు బయటకు రావాలి

అంతకుముందు.. మెడికో ప్రీతిది హత్యేనని బండి సంజయ్ అన్నారు. శవానికి ట్రీట్మెంట్ ఇస్తూ.. సినిమా చూపించారంటూ మండిపడ్డారు. నిందితుడ్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పిన ఆయన.. ప్రీతి కేసులో ఆధారాల్ని తారుమారు చేశారని విమర్శించారు. డెడ్‌బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి.. ఈ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. ప్రీతి కేసుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన బండి సంజయ్.. సిట్టింగ్ జడ్జితో ప్రీతి ఘటనపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Show comments