Site icon NTV Telugu

Bandi sanjay : 6 గ్యారంటీల అమలు చేతగాక తెరపైకి స్థానిక సంస్థల ఎన్నికలు

Bandi Sanjay

Bandi Sanjay

6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటి వరకు వాటి అమలు విషయానికి వచ్చే సరికి దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులైనా 6 గ్యారంటీలను అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల సాకు చూపి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. అయినప్పటికీ 6 గ్యారంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం? వాటి విధివిధానాలేమిటి? అనే దానిపై నేటికీ కసరత్తు చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే పేరుతో ఆ హామీలను అమలు చేయకుండా మళ్లీ దాటవేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ ఆ పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేస్తూ ప్రజలను మోసం చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పాలని కోరుతున్నాం.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను భారతీయ జనతా పార్టీ పక్షాన కోరేదేమిటంటే… కేంద్రం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే, తద్వారా పంచాయతీల్లో అభివ్రుద్ధి పనులు జరగాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తే… కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉంది. ఇందుకు కేసీఆర్ ఫ్రభుత్వ నిర్వాకమే నిదర్శనం. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి కోసం మంజూరు చేసిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించి జీతాలకు, కరెంట్ బిల్లులకు, ఇతరత్రా అవసరాలకు వాడుకున్న సంగతి తెలిసిందే. తద్వారా గ్రామాల్లో అభివ్రుద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డ సంగతి విదితమే. ముఖ్యంగా సర్పంచులు సొంత డబ్బులను వెచ్చించి గ్రామాభివ్రుద్తి పనులు కొనసాగించి బిల్లులు దరఖాస్తు చేసుకుంటే… ఆ డబ్బులివ్వకుండా, గ్రామాల అభివ్రుద్ధి జరగకుండా సర్పంచులను అరిగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పురిగొల్పిన విషాద సంఘటనలు సైతం మన కళ్లముందు మెదులుతున్నాయి.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది. నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో అభివ్రుద్ది కుంటుపడింది. సర్పంచులు లేకపోవడంతో స్థానిక సంస్థల్లో పాలన పడకేసింది. పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తే.. కేంద్ర నిధులు పూర్తిగా దారి మళ్లించే ప్రమాదముంది. ఇది జరగకుండా ఉండాలంటే… కేంద్రం విడుదల చేసే ప్రతిపైసా గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికే చెందాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలకు బీజేపీ పక్షాన విజ్ఝప్తి చేస్తున్నాం. తద్వారా కేంద్ర నిధులను పూర్తిగా దారి మళ్లించి గ్రామ పంచాయతీలు అభివ్రుద్ధికి నోచుకోకుండా చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరుతున్నాం.

Exit mobile version