Bandi sanjay comments on CM KCR: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. మోదీని ఎదుర్కొనే ముఖం లేకే నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరు అవుతున్నారని విమర్శించారు. మీకు నీజాయితీ ఉంటే ఇవే అంశాలు నీతి ఆయోగ్ మీటింగ్ లో చెప్పాలని సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ గొప్పదని వేనోళ్లలో పొగిడింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. మీ ఏడుపంతా కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇస్తున్నందుకే అని అన్నారు. గతేడాది రూ.5 వేల కోట్ల కంటె ఎక్కువ నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు భూమికి రాస్తారా అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. మీరు బెల్ కొట్టిస్తే ఒప్పు, నీతి ఆయోగ్ సమావేశంలో బెల్ కొడితే తప్పా..? అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ మీకు పాలన చేతకావడం లేదు.. సర్కారీ స్కూళ్లకు వెళ్లి క్లాసులైనా చెప్పుకోండని చురకలు అంటించారు. మిమ్మల్ని ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన బండి సంజయ్ అన్నారు. మీ 8 ఏళ్ల పాలనలో ఎనాడూ అధికారిక మీటింగులకు వెళ్లేందుకు ఆసక్తి చూపని మాట వాస్తవం కాదా? కేవలం మీ రాజకీయ లబ్ది కోసం, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసం… ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం ఢిల్లీ పోవడం తప్ప ప్రజల కోసం ఏనాడైనా చర్చించడానికి వెళ్లారా అంటూ ప్రశ్నించారు. మీరు కోరినంత డబ్బులిస్తే నీతి అయోగ్ మంచిది… లేకుంటే మంచిది కాదా? ఇదనే మీ రాజనీతి? మీకు నచ్చినట్లుగా, మీ పక్షాన లేదని నీతి అయోగ్ లాంటి గొప్ప సంస్థను నిందించడం ప్రజా స్వామ్య వ్యవస్థలను అవమానించడమే అని అన్నారు. నరేంద్రమోదీ గారి ప్రభుత్వం లబ్దిదారులకే నేరుగా నగదును బదిలీ (డీబీటీ) చేస్తుండటంతో ప్రజలకు ఫలితాలు అందుతున్నయి. దీనిపై మీ పెత్తనం పోతుందని, కమీషన్లు అందడం లేదనే అక్కసుతోనే మీరు నీతి అయోగ్ పై ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే కరోనా సమయంలో మీరు హెలికాప్టర్ మనీ (నేరుగా రాష్ట్రాలకు నిధులు) పంపాలని కోరిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.
Read Also: Jagdeep Dhankhar: రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి దాకా.. జగ్దీప్ ధన్‌కర్ ప్రస్థానమిదే..
ఎన్నికల కోసం, ఓట్ల కోసం అనుచితమైన ఉచితాలిస్తూ ఆర్దిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం వల్ల శ్రీలంక వంటి పరిస్థితి వస్తుందని, రాష్ట్రాల ఆర్దిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో, కేంద్రానికి ఏం సంబంధం? సుప్రీం సూచనను కేంద్రానికి అంట గట్టడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనం అని అన్నారు. ఇన్నాళ్లు నరేంద్ర మోదీ గారిని తిట్టుడు, బీజేపీని తిట్టుడు, బండి సంజయ్ ను తిట్టుడుతోనే కేసీఆర్ కు సరిపోయింది… ఇగ నీతి అయోగ్ ను తిట్టడం మొదలైందని అన్నారు. బతుకమ్మ చీరలు కూడా హైదరాబాద్ లో తయారు చేయించడం చేతగాక సూరత్ కేసీఆర్ దిగుమతి చేసుకునే నువ్వు ఇతర దేశాల దిగుమతి గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ముందు ప్రగతి భవన్ ఫర్నీచర్ ను చైనా నుండి ఎందుకు తెప్పించుకున్నరో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. రైతు చట్టాలను విమర్శిస్తున్న కేసీఆర్… ఆనాడు రైతు చట్టాలను సమర్ధించిన మాట వాస్తవం కాదా? ఏనాడైనా రైతుల తరపున ఉద్యమించినవా..? అని ప్రశ్నించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న మీరు… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంగతేంది అని బండి సంజయ్ ప్రశ్నించారు.
