Bandi Sanjay: ప్రజలకు ఏ సమస్యా వచ్చిన బీజేపీ అండగా ఉంటుందని నమ్మకం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. బీజేపీ పోలింగ్ బూత్ సశక్తి కరణ్ అభియాన్ బూత్ స్థాయిలో బలోపేతం పై ప్రత్యేక దృష్టి సాదించింది. ఈనేపథ్యంలో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈకార్యక్రమంలో.. జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జి లు , సశక్తి కరణ్ అభియాన్ రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలతోపాటు బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాష్ట్ర సహా ఇంఛార్జి అరవింద్ మీనన్ హాజరయ్యారు. సరల్ యాప్, పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్య అంశాలను కింది స్థాయికి తీసుకోవడంపై కూడా సమావేశంలో చర్చించారు. కార్నర్ మీటింగ్ లు జరుగుతున్న తీరు, వస్తున్న స్పందన పై సమీక్ష నిర్వహించారు.
Read also: BRS News Paper In AP: త్వరలోనే అక్కడ బీఆర్ఎస్ న్యూస్ పేపర్..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో శక్తివంతం అవుతుందని అన్నారు. BRS రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కొనియాడారు. ప్రజా పాలన ను గాలికి వదిలేసి కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన బీజేపీ అండగా ఉంటుందని నమ్మకం ఏర్పడిందని స్పష్టం చేశారు. కార్యకర్తలు నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయం బీజేపీ నే నని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఏ పార్టీకి పోలింగ్ బూత్ కమిటీలు లేవు శక్తి కేంద్రాలు లేవని బండి సంజయ్ పేర్కొన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడం వలనే 18 రాష్టాల్లో అధికారంలోకి వచ్చామమని, ఇప్పటివరకు 80 శాతం మండల కమిటీలు, శక్తికేంద్రాలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేసామన్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేది బీజేపీ నే అని.. దీనికి నిదర్శనం దుబ్బాక హుజురాబాద్, జీ హెచ్.ఎంసి ఎన్నికలే అన్నారు. కార్నర్ మీటింగ్ పెట్టడంతో స్థానిక ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం కేంద్రప్రభుత్వం సంక్షేమ పధకాలను ప్రజలకు చెప్తున్నామన్నారు. కష్టపడి, ఇష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు భరోసా కల్పిద్దామన్నారు బండిసంజయ్.
Cyber fraud: కరెంట్ బిల్లు పేరిట సైబర్ మోసం.. ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు