Bandi Sanjay: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న సందర్భంగా ఉదయం శ్రీ మహాశక్తి దేవాలయంలోని అమ్మవార్ల వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశక్తి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి అమ్మవారి ఆశీస్సులందుకున్నారు. అనంతరం తన నివాసానికి విచ్చేసి మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. నామినేషన్ వేయనున్న బండి సంజయ్ వద్దకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకున్నారు. ఎంపీ కార్యాలయం వద్దకు బండి సంజయ్ ను రాజాసింగ్ కలిసారు. జై శ్రీరాం… భారత్ మాతాకీ జై నినాదాలతో ఎంపీ కార్యాలయం మారుమోగింది. ఎన్టీఆర్ విగ్రహ చౌరస్తాకు బండి సంజయ్, రాజాసింగ్ బయలుదేరారు. కాసేపట్లో బైక్ ర్యాలీని ప్రారంభ కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. బైక్ ర్యాలీగా స్వచ్ఛందంగా యువకులు తరలివస్తున్నారు.
హుజూరాబాద్ రిజల్ట్ గజ్వేల్‌లోనూ పునరావృతం అవుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 7న గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్నానని ప్రజలంతా తరలిరావాలని ఈటల కోరిన విషయం తెలిసిందే. కాగా.. ములుగు మండలం కొక్కొండ, ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇక మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ వేయనున్నారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 240 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.
Vijayasai Reddy: పురంధేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ