Site icon NTV Telugu

Bandi sanjay: బండి అరెస్ట్‌ పై హైకోర్టులో పిటిషన్‌.. బొమ్మల రామారంలో అదుపులో బీజేపీ నేతలు

Bandi Sanjay Arest

Bandi Sanjay Arest

Bandi sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. బండి సంజయ్ పై బొమ్మల రామారం పోలీసుల లీగల్ ప్రొసీడింగ్స్ కు రంగం సిద్దం చేసింది. బండి సంజయ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయనున్నారు పోలీసులు. బండి సంజయ్ కు 41 సి.అర్.పిసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయనున్నారు. అనంతరం ఇక్కడి నుండి బండి సంజయ్ ను వరంగల్ కు తరలించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారంనాడు రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను అర్ధరాత్రి కరీంనగర్ నుండి యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే బండిసంజయ్‌ అరెస్ట్‌ ను ఖండిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నేత కున శ్రీశైలం గౌడ్, పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నేత కున శ్రీశైలం గౌడ్ బండిసంజయ్‌ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాంటూ, ఏ కారణం లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. దీంతో కార్యకర్తల నినాదాలతో బొమ్మల రామారం అట్టుడుకింది. రంగంలోకి దిగిన పోలీసులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నేత కున శ్రీశైలం గౌడలను అదుపులో తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

Read also: Boney Kapoor : ఛీ..ఛీ ఈ వయసులో ఇదేం బుద్ధి.. శ్రీదేవీ భర్తపై నెటిజన్ల ఫైర్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 10వ తరగతి పేపర్ లీక్ కు బండి సంజయ్ కు సంబంధ లేదని అన్నారు. బండి సంజయ్ బేషరతుగా విడుదల చేయాలని తెలిపారు. రాష్ట్రంలో లీకేజీ పాలన నడుస్తుందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కూడా అరెస్ట్ చేసి గొంతు నొక్కుతున్నారని నిప్పులు చెరిగారు రఘనందన్‌ రావు. బొమ్మల రామా రం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ నేత కున శ్రీశైలం గౌడ్ అదుపులోకి తీసుకుని కీసర పోలీస్ స్టేషన్ తరలించారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని కునా శ్రీశైలం డిమాండ్ చేశారు.కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఖండించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
Arunachal Pradesh: భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం.. చైనా పేరు మార్పులపై అమెరికా..

Exit mobile version