Site icon NTV Telugu

Bandi Sanjay : కమిషన్ల మీద కక్కుర్తి తప్ప వేరే ధ్యాస లేదు

Bandi Sanjay

Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14 తేదీన జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నుండి ప్రారంభిస్తున్నామన్నారు. సుమారు 311 కిలో మీటర్లు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తో ముగిస్తామన్నారు. తప్పకుండ ప్రజా సమస్యల పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తామని, రాజన్న ఆశీర్వచనం కోసం వచ్చాననని ఆయన వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఎల్లుండి ఢిల్లీకి పోతుండు… ఢిల్లీకి ఎందుకు వెళ్తుండు.. సిల్లి రాజకీయాల కోసం, ధాన్యం కొను లేకుంటే గద్దె దిగు.. ఏడేళ్ల నుండి లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నావని ఆయన ప్రశ్నించారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు.. పంటలు కోతకి వచ్చాయి.. నీకు పరిపాలన చాతకాదు..గద్దె దిగు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.కొంత మంది బ్రోకర్లు వత్తాసు పలుకుతున్నాడు…కమీషన్ల కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. కమీషన్ల మీద కక్కుర్తి తప్ప వేరే ధ్యాస లేదని, సీఎంను రైతులు ఎవరు నమ్మడం లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగం పై సీఎం కేసీఆర్ కి నమ్మకం లేదు..అందుకే మహిళలను అగౌరవ పరిచాడని, కేటీఆర్‌ డ్రామా రావు నీ నోరు అదుపులో పెట్టుకో అని ఆయన హెచ్చరించారు.

Exit mobile version