Site icon NTV Telugu

Bandi Sanjay : రెండో దశ యాత్ర ఏప్రిల్ 14 నుంచి

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్‌ 14 నుంచి అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. బండి సంజయ్ తన మొదటి దశ యాత్రను చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ఆగస్టు 2021లో ప్రారంభించి, 36 రోజులలో హుస్నాబాద్‌లో ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు అర డజను పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముగించారు. ఇదిలాఉండగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నేతలు నినాదాలు చేశారు.

Exit mobile version