NTV Telugu Site icon

Bandi Sai Bhagirath: ముదురుతున్న బండి సంజయ్ కొడుకు వివాదం..మరో వీడియో వైరల్!

Bandi Sai Bhagirath

Bandi Sai Bhagirath

Bandi Sai Bhagirath: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కుతోంది. తోటి విద్యార్థులను దూషించి కొట్టిన ఓ వీడియో ఇప్పటికే వైరల్‌గా మారగా.. ఇప్పుడు మరో వీడియో విడుదల కావడం సంచలనంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు.. ఓ జూనియర్ విద్యార్థిని కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Read also: Hyderabad Traffic Restrictions: ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎందుకంటే?

దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలపై కేసులు ఏంటని ప్రశ్నించారు. బాధితుడే (దెబ్బలు తిన్న శ్రీరాం అనే విద్యార్థి) తాను తప్పు చేశాను అందుకే కొట్టాడని చెప్పారని, చెప్పాడని మరి అలాంటి సమయంలో కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని కానీ.. పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం ఏంటి? అని మండిపడ్డారు. నాతో రాజకీయం చేయడం చేతగాక, తట్టుకోలేక నా కొడుకును లాగుతావా? నీ మనువడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేనే ఖండించానని బండి సంజయ్‌ గుర్తు చేశారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా? నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టిస్తవా? అని ప్రశ్నించారు. నిజాం మనవడి అంత్యక్రియలు, యాదాద్రి ఆదాయంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పక్కదారి పట్టించేందుకే తన బిడ్డ అంశాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.

Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?

నిన్న వెలుగులోకి వచ్చిన వీడియోపై వివాదం కొనసాగుతుండగా.. మరో వీడియో బయటకు రావడంతో రాజకీయ దుమారం రేపుతోంది. ఒక గదిలో బండి సంజయ్ కొడుకుతో సహా పలువురు విద్యార్థులు తోటి విద్యార్థిని కొట్టడం కనిపించింది. ఈ వీడియోలో బండి సంజయ్ పక్కనే ఉన్న వారిని వెళ్లవద్దని చెబుతూ బాధితురాలిపై దాడి చేస్తున్నాడు. వరుస వివాదాలు, కేసుల కారణంగా బండి సంజయ్ కుమారుడిని మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో బండి సంజయ్ కొడుకు కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు నేతల మధ్య ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరో వీడియో లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. తోటి విద్యార్థి అని కనికరం లేకుండా కాళ్లతో విచక్షణారహితంగా బాధిత విద్యార్థిపై కొట్టడం విద్యార్థుపట్ల ఇదే నా గౌరవం అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఎంత తప్పుచేస్తే మాత్రం కాళ్లతో కొట్టాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Barkat Ali khan Funeral: నేడు అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు

Show comments