Site icon NTV Telugu

Balka Suman : ఓయూను రాజకీయ పబ్బం కోసం ఒక వేదిక చేసుకుంటారా

Balka Suman

Balka Suman

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. రాహుల్‌ గాంధీ టూర్‌ వ్యవహారం అంతా ఉస్మానియా యూనివర్సీటీ చుట్టే తిరుగుతోంది. అయితే తాజాగా ప్రభుత్వ విప్‌ బాల్క్‌ సుమన్‌ రాహుల్‌ టూర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ విభజన చట్టం హామీలను ఎందుకు అమలు చేయడం లేదో జేపీ నడ్డా సమాధానము చెప్పాలన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో నడ్డా జవాబు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని, ఓయూకి వచ్చి రాహుల్ గాంధీ ఏమి చేస్తారని తెలంగాణ సమాజం ప్రశిస్తుందన్నారు.

ఓయూను రాజకీయ పబ్బం కోసం ఒక వేదిక చేసుకుంటారా.? అని ఆయన ప్రశ్నించారు. ఓయూలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు వద్దని 2021 జూన్ లో పాలక మండలి నిర్ణయం తీసుకుందని, ఓయూ పాలకమండలి అనుమతి నిరాకరణకు.. ప్రభుత్వంకు ఏం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓయూ వీసీని బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి… చీరలు, గాజులతో రేవంత్, జగ్గారెడ్డి అగ్రవర్ణ ఆధిపత్య ధోరణితో వీసీని అవమానించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

Exit mobile version