Balka Suman: అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు బుద్ది చెప్పాలి.. వివేక్ పై బాల్కసుమన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman: అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని వివేక్ పై చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులని ఆరోపించారు. ఆ కంపెనీ రామగుండం లో వివేక్ ఇంటి చిరునామా పైనే ఉందని అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరామన్నారు. ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రత్యేక వ్యయ పరిశీలకునికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వివేక్, కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాల పై నిఘా పెట్టాలని కోరామన్నారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారని మండిపడ్డారు. వివేక్ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరుతున్నామని తెలిపారు. డబ్బు అహంకారంతో వివేక్ నేతలను హరాజ్ పాటలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
Read also: Revanth Reddy: మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి పర్యటన.. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ప్రచారం
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నమ్మక ద్రోహి, మోసకారి వల్ల భాజపా కనీసం మేనిఫెస్టో కూడా ప్రకటించలేకపోయిందన్నారు. నేను కోట్లు సంపాదించి ఉంటే నీలాగా వ్యాపార సామ్రజ్యాన్ని ఏర్పరచుకునే వాన్ని కదా? అని ప్రశ్నించారు. డబ్బు సూట్ కేసులతో నేతలను కొనుగోలు చేసి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారని అన్నారు. ధన రాజకీయాలు చేసే వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పట్టిన పీడ అన్నారు. ఇలాంటి వాళ్లకు తెలంగాణ సమాజం బుద్ది చెప్పాలన్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తికి, వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ది చేస్తున్న వ్యక్తికి మధ్య చెన్నూరులో పోటీ అన్నారు. అభివృద్ధి పై మాట్లాడే దమ్ము లేక వివేక్ నాపై అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఆయన ఛానెల్ వి6,వెలుగు పేపర్ ప్రతినిధులు కూడా అక్కడే ఆయనకు పని చేస్తున్నారని అన్నారు. వివేక్ కుటుంబం హయాంలో… మా హయాంలో చెన్నూరు అభివృద్దిపై చర్చకు సిద్దం అన్నారు. ఆయనకు సంస్కారం లేదు.అలా మేము వ్యవహరించలేమన్నారు. అందుకే సీఈవో ను ఆధారాలతో కలిసి పిర్యాదు చేశా అన్నారు.
Telangana Elections 2023: ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. రాజస్థాన్ కంటే ఎక్కువ సొత్తు ఇక్కడే సీజ్
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!