NTV Telugu Site icon

Bajireddy Govardhan: దేశ ప్రధాని మోడీ కాదు కేడీ

తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు.

దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి బిల్లు మంజూరు చేస్తారు.సిగ్గు లేని వ్యక్తి మోడీ. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టీ జై తెలంగాణ అనిపించిన వ్యక్తి . బీజేపీ అంటేనే ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు.

సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసింది. మోడీ మాటలతో సుష్మ స్వరాజ్ ను కూడా అవమనిస్తురన్నారు. రోడ్ల పైకి వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని బహిష్కరించారు. బురఖాలు ధరించవద్దని కులాలకు మతాలను రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రం లో 80 వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది.

ఒక్క రూపాయి ఇవ్వకున్న శంకుస్థాపన చేయించాం. ఎంపీ అరవింద్ కి మొన్న ఆర్మూర్ జరిగిన బుద్ధి సరిపోలేనట్లు ఉందన్నారు బాజిరెడ్డి గోవర్థన్. గ్రామాల్లోకి వస్తే తగిన బుద్ధి చెబుతున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ ఏం ఇవ్వకున్నా అన్ని ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిచ్చి కుక్కలు బీజేపీలో తిరుగుతున్నాయి. ఇక నుంచి నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్, కేటీఆర్, వారి కుటుంబాన్ని తిడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు బాజిరెడ్డి గోవర్థన్.