Site icon NTV Telugu

Badugu Lingaiah : దేశంలో కేసీఆర్‌కు జనాదరణ పెరుగుతోంది

ఎన్నో సంక్షేమ పథకాలతో, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ బడుగు లింగయ్య అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీలు కేసీఆర్ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా దేశంలో కేసీఆర్ కు జనాదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణకు కేంద్రం మోసం చేస్తోందని, విభజన హామీలు నెరవేర్చమని కోరుతున్నా పట్టించు కోవటం లేదని ఆయన మండిపడ్డారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరయినవి కావని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనను తప్పు పడుతూ మోడీ మాట్లాడితే, బీజేపీ నేతలు నోరు మెదపలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి ఎపుడూ స్పందించలేదని, కేసీఆర్ నాయకత్వమే దేశానికి శరణ్యమన్నారు. దేశప్రజలు మార్పు కోరుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Exit mobile version