Site icon NTV Telugu

Chigirintha Parijatha: రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా.. అందుకే ఆపార్టీలో చేరుతున్నా..

Myour Parijatha

Myour Parijatha

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భారీగానే రాజీనామాలు వెలువెత్తుతున్నాయి. అయితే.. నేడు టీఆర్‌ఎస్ కి మరో షాక్ త‌గిలిందనే చెప్పాలి.. బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మెయిల్‌ ద్వారా పంపించారు.

అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట్‌ అభివృద్ధి కోసం అప్పటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీలోని కొందరు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతకాలంగా వ్యతిరేక భావనను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. క్రమశిక్షణతో, పార్టీపై అంకితభావంతో ప్రజలకు సేవలందించిన తనకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు.. అంతేకాకుండా.. కక్ష సాధింపు రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటివరకు తమకు సహకరించిన పార్టీ పెద్దలకు.. నాయకులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Srilanka Economic Crisis: దేశంలో స్కూళ్లు బంద్.. కారణం ఇదే

Exit mobile version