NTV Telugu Site icon

Peddapally Crime: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

Peddapally Crime

Peddapally Crime

Peddapally Crime: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆందోళనకు దారితీసింది. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ వ్యక్తి భార్య దివ్యకు ప్రసవం దగ్గర పడడంతో రోజుల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రసవం శనివారం చేయాల్సి ఉండగా ఆదివారం రాత్రి అయినప్పటికీ ప్రసవం చేసేందుకు ముందుకు రాలేదు. అక్కడున్న డాక్టర్లకు సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదు. తీరా ఆదివారం రాత్రి 9.30 గంటల సమయం దాటిన తర్వాత గర్భిణి దివ్య సీరియస్ గా ఉందని తక్షణమే కరీంనగర్ పంపించాలంటూ పెద్దపల్లి వైద్యులు తరలించినట్లు తెలిపారు.

read also: Pet Dog: కుక్కను పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాల్సిందే

తీరా కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లేసరికి కడుపులోని శిశువు మరణించినట్లు కరీంనగర్ వైద్యులు చెప్పినట్లు గర్భిణి భర్త పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అనంతరం మృతి చెందిన మగ శిశువుతో కలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మృతి చెందాడని వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిండు గర్భణీ అని కనికరం కూడా లేకుండా ఆమెను ఆసుపత్రి వర్గాలు అస్సలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేసేంత వరకు ఆసుపత్రి నుంచి కదిలేది లేదన తెలిపారు.
Pawan Kalyan: విశాఖ టు విజయవాడ.. గవర్నర్‌ను కలవనున్న జనసేనాని?