Site icon NTV Telugu

తెలంగాణ‌లో బీజేపీ పార్టీదే అధికారం : బాబు మోహన్

టీఆర్ ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర నాయకుడు బాబు మోహన్ కామెంట్స్ చేశారు. వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజల చేతులో ఉన్న ఓటు వజ్రాయుధం లాంటిదని దిగ్గజ నేతలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ల‌కు సైతం ఓటమి తప్పలేదన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజల శ్రేయస్స కోసం నిలబడని ఎంత గొప్ప నాయకుడైన మట్టి కరువడం ఖాయమ‌ని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం, సినిమా రంగాల్లో కంటే రాజకీయ రంగంలో ప్రజా సేవ చేయడం.. త‌న జీవితానికి సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. మానుకోట త‌న‌ జన్మ స్థానమ‌ని… ఇక్క‌డి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఓటరుతో మమేకమై వారి కష్టా, నష్టాలల్లో అండగా ఉండి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version