NTV Telugu Site icon

Sadar Festival: సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. భాగ్యనగరంలో దున్నల హడావుడి

Sadar Festivel

Sadar Festivel

Sadar Festival: దీపావళి పండుగ తర్వాత సదర్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్దమతోంది. డప్పు చప్పుళ్లు, యువత నృత్యాల నడుమ అందగా ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు స్పెషల్‌ అట్రక్షన్‌గా నిలవనున్నాయి. ఈ పండుగ యాదవులు ఘనంగా జరుపుకుంటారు. సందర్‌ పండుగ దీపావళి నుండి రెండు రోజుల పాటు జరిగే ఈసంబరాలను చూడడానికి వేలాది మంది నగరానికి వస్తుంటారు. ఈ.. సదర్‌ ఉత్సవాలను 1946 నుంచి నారాయణగూడలో సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్‌ ప్రారంభించగా.. నాటి నుంచి నేటి వరకు ప్రతి యేడు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జంట నగరాల్లో బుధవారం సదర్‌ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా నారాయణగూడలో ఈ నెల 27న (గురువారం) నిర్వహించే సదర్‌ ఉత్సవాలకు హర్యానా, కేరళ, పంజాబ్‌తో పాటు జంట నగరాలు, శివార్ల నుంచి దున్నలను ముస్తాబు చేసి తీసుకువస్తారు. ఈఏడాది 26, 27న విన్యాసాలు జరగనున్నాయని తెలిపారు. 27వ తేదీన సాయంత్రం ముషీరాబాద్‌లో ప్రారంభమై నారాయణగూడ వరకు ప్రదర్శన ఉంటుంది. తెల్లవారుజాము వరకు కొనసాగనుంది. ఉత్సవాల కోసం ఇతర రాష్ట్రాల దున్నరాజులు కూడా వస్తుంటాయి.

ముషీరాబాద్‌కు చెందిన ఎడ్ల హరిబాబు యాదవ్‌, చప్పల్‌బజార్‌ కు చెందిన లడ్డు యాదవ్‌, ఖైరతాబాద్‌కు చెందిన మధు యాదవ్‌తో పాటు మరికొందరు సదర్‌లో పోటీ పడేందుకు దున్నలు సిద్ధం చేస్తున్నారు. ఎడ్ల హరిబాబు యాదవ్‌ ఇప్పటికే హర్యానాకు చెందిన దున్నరాజుతో పాటు తలసాని అర్జున్‌, శ్రీకృష్ణ వంటి దున్నలను తీసుకొచ్చారు. హర్యానాలో పలు చాంపియన్‌ షిప్‌లను గెలుచుకున్న దున్నను నగరానికి తరలించిన ఆయన దాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయిస్తూ పోషకాహారం అందిస్తున్నారు. ఈసారి స్పెషల్‌ అట్రాక్షన్‌ గా ఆస్ట్రేలియా దున్నరాజు షేర్ఖాన్‌ ఉండనుంది. ప్రత్యేక ఆకర్షణగా 35కోట్ల హర్యానా దున్నరాజు గరుడ ఉండనుంది. దీనిమేత ఖర్చు రోజుకు రూ. 8వేల నుండి రూ.10వేల దాకా ఉంటుంది. హర్యానా దున్నరాజు దాణాగా డ్రైఫ్రైట్స్‌, యాపిల్స్‌, 10లీటర్ల పాలు అందిస్తారు. వారానికోసారి రమ్ము, విష్కీ కూడా తాగిస్తారు.

Read also: Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లియిందా.. ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?

హర్యానాకు చెందిన శ్రీకృష్ణ దున్న ఈ సారి సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్‌, హర్యానా రాష్ట్రంలోని ఇసాన్‌ జిల్లా జుగ్లాండ్‌ గ్రామానికి చెందిన శ్రీకృష్ణను సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్‌ వాహనంలో సదర్‌ ఉత్సవాల ప్రదర్శన కోసం ముషీరాబాద్‌కు తీసుకువచ్చారు. 1800 కిలోల బరువు, ఏడు అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు.. ఐదు ఏండ్ల వయస్సు.. శ్రీకృష్ణ దున్నకు ప్రతి రోజు రూ.5 వేల విలువ చేసే ఆహారం ఉదయం.. సాయంత్రం 10 లీటర్ల పాలు, డ్రైఫ్రూట్స్‌, ఖాజు, పిస్తా, ఆపిల్‌ పండ్లు, నెయ్యి, బెల్లం తదితర వాటిని ఆహారంగా పెడతారు. ప్రతి రెండు లీటర్ల ఆవనూనెతో మసాజ్‌ చేయడంతో పాటు షాంపుతో స్నానం, దీని ఆలన పాలన చూసేందుకు ఇద్దరు కార్మికులు ఉన్నారు. పడుకోవడానికి ప్రత్యేక ఫ్యాన్‌లు ఏర్పాటు చేశారు.

పంజాబ్‌ రాష్ర్టానికి చెందిన ఐదేండ్ల కింగ్‌ దున్న బరువు 1600 కిలోలు, ఎత్తు ఆరున్నర అడుగులు, పొడువు ఆరు ఫీట్ల ఆకర్షణతో కనిసిస్తుంది, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు చెందిన తలసాని అర్జున్‌ యాదవ్‌ దున్న వయస్సు నాలుగేండ్లు. ఇక.. బరువు 1500 కిలోలు, ఎత్తు ఆరడుగుల ఫీట్లతో బాహుబలి దున్నగా కనిపిస్తున్నది. అలాగే నగరానికి చెందిన భీమ్‌ దున్న సైతం సదర్‌ ఉత్సవాలకు సిద్ధమైంది. ఇక సదర్‌ ఉత్సవాలతో భాగ్యనగరం దున్నల హడావుడి మొదలైంది.అయితే.. దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి, నల్లగా నిగనిగలాడేలా తయారుచేస్తారు.. అందుకు వెన్న.. పెరుగును ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో అలంకరిస్తారు… నెమలి ఈకలను అమర్చుతారు. ఇలా అలంకరించిన తరువాత సుగంధ ద్రవ్యాలను చల్లి, అప్పుడు కుస్తీకి దింపుతారు. నారాయణగూడలో సదర్‌ ఉత్సవాలు మిన్నంటనున్నాయి.

Asaduddin Owaisi: ముస్లింలను ఎవరూ పట్టించుకోవడం లేదు.. అందుకు ప్రధాని మోదీకి అభినందనలు..

Show comments