Site icon NTV Telugu

Telangana : ఆ డాక్టర్లకు శుభవార్త.. ఈ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

Telangana Govt

Telangana Govt

Telangana : తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగంలో మరోసారి అభివృద్ధి దిశగా ముందడుగు పడింది. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MRB) డాక్టర్లకు శుభవార్తను అందించింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు , ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ఎంఎన్‌జేలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ద్వారా ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగవుతాయని, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?

ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. “ఇటీవలే 630 యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించాం. ప్రస్తుతం మరో 200కి పైగా పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశాం,” అని తెలిపారు. ఆయుష్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని క్యాన్సర్‌ వైద్య సేవలను విస్తరించే ప్రక్రియలో భాగంగా ఎంఎన్‌జే హాస్పిటల్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అడుగుగా మారనుంది. “కొత్తగా నియమితులైన డాక్టర్లతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాల స్థాయిలోనూ ప్రభుత్వ క్యాన్సర్‌ సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు.

కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ క్యాన్సర్‌ కేర్ (DCC) సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో రీజనల్ క్యాన్సర్‌ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. “ఈ సెంటర్లు పూర్తయిన తరువాత, పేషెంట్లు హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే అత్యాధునిక వైద్య సేవలు పొందగలుగుతారు,” అని మంత్రి స్పష్టం చేశారు.

Video Viral: ఏకంగా నక్కనే మింగేసిన కొండచిలువ.. వీడియో వైరల్

Exit mobile version