Amazon Fraud: అమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ లో ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో భక్తులు, ప్రజలు కొనుగోలు చేసేందుకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. భారీ లాభానికి అమెజాన్ ఇలాంటి దిగ్గజ కంపెనీలు తెగపడటం సంచలనంగా మారింది. అయోధ్యా రామ మందిరంలో రాముడి ప్రతిష్టనే ఇంకా జరిగేందుకు రెండు రోజులు వున్నా.. దానిని ఆసరాగా తీసుకున్న కొందరు అయోధ్య పేరుతో అమ్మకాలకు తెర లేపుతున్నారు. దిగ్గజకంపెనీలోనే ఒకటిగా పేరు పొందిన అమెజాన్ లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు అమ్మకానికి పెట్టడం కీలకంగా మారింది. ఇది నిజమని నమ్మిన కొందరు భక్తులు, ప్రజలు వేలకొద్ది ఆర్డర్లు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ ఫ్రాఢ్ ని గమనించిన కేంద్రం దానిపై నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కు ఫిర్యాదు చేసింది. ఈవిషయం పై రంగంలోని దిగిన అధికారులు అమెజాన్ కు సెంట్రల్ కన్సుమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
సాధారణ మైన దూద్ పేడ లను.. అయోధ్య లడ్డూల పేరుతో అమెజాన్ విక్రయించడాన్ని తీవ్రంగా ఖండించింది. http://www.amazonలో స్వీట్ల విక్రయానికి సంబంధించి నోటీసు ఇచ్చింది. శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం ముసుగులో అమెజాన్ మిఠాయిల అమ్మకాలతో కూడిన మోసపూరిత వ్యాపార పద్ధతులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సిఎఐటి చేసిన ప్రాతినిథ్యం ఆధారంగా చర్య తీసుకుంది. ఏడు రోజుల్లోగా అమెజాన్ నుండి CCPA ప్రతిస్పందన కోరింది. లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశ వ్యాప్తంగా అయోద్యా రామ మందిరం హాట్ టాపిక్. జనవరి 22 న జరిగే రామ మందిర ప్రతిష్టకు యావత్ దేశంలోని ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీ అయోధ్య పేరును వాడుకుంటున్నారు. అయోధ్య ప్రసాదం, విభూది, హారం, అకింతలు అంటూ ఆన్ లైన్ విక్రాయాలు చేస్తున్నారు. కొందరు భక్తులు దీనిని నమ్మి తెగ ఆర్డర్లు పెడుతున్నారు. అయితే గమనించవిషయం ఏమిటంటే.. ఇంకా రామ మందిర ప్రతిష్ట జరగకముందే ముందే ఎలా విక్రయాలు జరుపుతారు అనే ప్రశ్నలు మాత్రం ఎవరి రాకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా ప్రజలు, భక్తులు ఇలాంటివి ఫ్రాడ్ ను నమ్మవద్దని అధికారులు తెలిపుతున్నారు.