NTV Telugu Site icon

Karimnagar: చదువు “కొనలేక” పేరెంట్స్ పాట్లు

School

School

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యా సంవత్సరం మొదలు అవుతున్న నేపథ్యంలో కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోడిపికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎల్ కేజీ నుండే లక్షల్లో ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీగా వసూలు చేస్తూ అకాడమిక్ సంవత్సరంకు అడ్మిషన్లు పూర్తి చేసే పనిలో కార్పొరేట్ యాజమాన్యాలు పడ్డాయి.

ఇక కరీంనగర్ లోని ఓ కార్పొరేట్ స్కూల్ లో జరుగుతున్న అధిక వ‌సూల్ల‌పై ఆరా తీసేందుకు కొంద‌రు త‌ల్లిదండ్రుల రూపంలో ఓ కార్పొరేట్ స్కూల్ వెళ్ళారు. 1 వతరగతి విద్యార్థికి సంవత్సరానికి 80 వేలు, 6 వ తరగతి విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయలు చెప్పారు. దీనితో పాటు స్పోర్ట్స్, డ్యాన్స్, ఇతర ఫీజులు మరో 10 వేలు అదనంగా ఉంటాయని చెప్పారు. ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫీజులు ఉన్నాయి ఆఫర్ అవ్వగానే అడ్మిషన్లు కూడా దొరకవని చెప్ప‌డంతో ఖంగుతిన్నాడు.

కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. 1 వ తరగతి నుండే లక్షల్లో ఫీజులు ఉండటంతో మధ్యతరగతి ప్రజలు పిల్లలకు ఫీజుల భూతం పట్టుకుంటుంది. కార్పొరేట్ తరహాలో విద్య అందిస్తామని కోర్సుల పేరుతో నయా దందా మొదలు పెట్టాయి కొన్నీ కార్పొరేట్ స్కూల్స్. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్టించుకోవాల్సిన శాఖ అధికారులు చోద్యం చూస్తుండటంతో కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి ప్రవేటు స్కూల్స్ యాజమాన్యాలు. జిల్లాలో 20 కి పైగా కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఇలాంటి వారిపై దృష్టి సారించి వీరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

వీరికి ఇంత మొత్తంలో ఫీజులు చెల్లించ‌లేక ఎంతో మంది త‌ల్లితండ్ర‌లు ఇబ్బందులు గురవుతున్నారు. పిల్ల‌భ‌విష్య‌త్తు గురించి ఆలోచించాలా.. చాలీ చలని జీతంలో ఎలా ఫీజులు క‌ట్టాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పిల్ల‌లు స్కూల్ ల‌కు వెళ్లాలంటే చ‌దువు కొనే ప‌రిస్థితులు ఏర్పాడ్డాయ‌ని తల్లిదండ్రులు వాపోతున్నారు. మ‌రి ఇలాంటి కార్పొరేట‌ర్ స్కూల్ల‌పై అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?