AV Solutions Scam : హైదరాబాద్‌లో మరో భారీ ఇన్వెస్ట్‌మెంట్ స్కాం వెలుగుచూసింది. మాదాపూర్‌లో ఆధారంగా పనిచేసిన ఏవి సొల్యూషన్స్ , ఐఐటి క్యాపిటల్స్ పేరుతో పెట్టుబడిదారులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, 3200 మందికి పైగా బాధితుల నుండి సుమారు 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పెట్టుబడులు అన్నీ సురక్షితంగా ఉంటాయని, స్టాక్ మార్కెట్‌లో పెట్టితే అధిక లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి డిపాజిటర్లను ఆకర్షించారు.
Betting Apps Bill : ఆన్‌లైన్ గేమింగ్ కొత్త బిల్లు.. ఈ-స్పోర్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ ..!
పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బును నిజమైన పెట్టుబడులుగా మార్చకుండా, నకిలీ అకౌంట్లలోకి మళ్లించారు. స్టాక్ మార్కెట్‌లో బలమైన కంపెనీల ద్వారా లాభాలు వస్తాయని ప్రచారం చేసినప్పటికీ, వాస్తవానికి మొత్తం మోసపూరిత కార్యకలాపమేనని అధికారులు ధృవీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏవి సొల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎం.డి శ్రియస్ పాల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏవి సొల్యూషన్స్‌కి అనుబంధంగా దాదాపు 10 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కంపెనీల ద్వారా దేశంలో సేకరించిన నిధులను విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఏవి సొల్యూషన్స్, శ్రీనివాస అనల్టిక్, ట్రేడ్బుల్ టెక్నాలజీ, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ పేర్లతో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ సంస్థలు తమను BSE, SEBI లో నమోదు అయిన కంపెనీలుగా ప్రచారం చేసుకొని ప్రజలను నమ్మించారు. కానీ వాస్తవానికి పెట్టుబడులు అన్నీ మోసపూరిత పథకాలే. పలు రాష్ట్రాల్లో కూడా ఈ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Maoists : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. కీలక నేతలు పోలీసుల అదుపులో
