తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… దీంతో.. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి… ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపునీరు వచ్చిచేరుతుండడంతో.. మూసి ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది.. దీంతో.. గేట్లు ఎత్తేవేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తివేసి అవకాశం ఉండడంతో.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం సంబంధించిన మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు.. ఈ విషయాన్ని గ్రామాల సర్పంచులు తక్షణమే ఆయా గ్రామాల్లో డప్పు చాటింపు ఇప్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.