NTV Telugu Site icon

Attack: కారెక్కిన మేకలు.. కత్తులతో దాడి చేసుకున్న జనాలు

Ataks

Ataks

Attack With Knives: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో ఓ కుటుంబం రెచ్చిపోయింది. తల్వార్లతో , రాడ్లతో మరో కుటుంబపై విచక్షణా రహితంగా దాడి చేసింది. గాయాలైన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

రంగారెడ్డి రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో ముస్తాక్ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరు ఇంటి ఎదురుగా కారును పార్క్‌ చేశారు. అయితే అక్కడే వున్న రిజ్వాన్ కుటుంబం కూడా నివాసం ఉంటుంది. అయితే బక్రీద్‌ సందర్భంగా వారు మేకలను ఇంటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మేకలను మేతకు బయటకు వదిలారు రిజ్వాన్ కుటుంబం. అయితే బయటకు వచ్చిన మేకలు కారు ఎక్కి పాడుచేశాయి. అయితే ముస్తాక్ అహ్మద్ అది గమనించి మేకలను వేరు చోటు వదలాలని, కారును పాడు చేస్తున్నాయని తెలిపాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన రిజ్వాన్, ముస్తాక్ అహ్మద్ పై దాడి చేశాడు. తల్వార్లతో , రాడ్లతో ఒకరినొకరు దాడిచేసుకున్నారు. ముస్తాక్ అహ్మద్ పై రిజ్వాన్ దాడి చేశాడు. ముస్తాక్ అహ్మద్, మహమ్మద్ అలీ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన రిజ్వాన్ కుటుంబంపై మర్డర్ కేస్ నమోదు చేయాలని ముస్తాక్ అహ్మద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆడవాళ్ళు సైతం మాపై దాడి చేశారంటూ బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

బాధితుడు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ.. మేకలను కట్టేసుకోవాలని చెప్పినందుకు మా కుటుంబం పై రిజ్వాన్ కుటుంబం దాడి చేశారని అన్నాడు. లగ్జరీ కార్లను నడుపుతుంటానని పేర్కొన్నాడు. ఒక్కోసారి వాటిని ఇంటి ముందు పార్క్ చేయాల్సి వస్తుందని, ఆ సమయంలో మేకలు కార్లు పైకి ఎక్కడంతో డ్యామేజ్ అవుతుందని తెలిపానని అన్నాడు. ఈ విషయాన్ని రిజ్వాన్ కుటుంబానికి చెప్పామని తెలిపాడు. ఇవాళ ఉదయం రిజ్వాన్ కుటుంబం నా తమ్ముడు మహ్మద్ అలీని మాట్లాడుదామని పిలిపించి దాడి చేశారని అన్నాడు. మా తమ్ముడు మహ్మద్ అలీ ఛాతిలోకి మూడించులు కత్తి దూసుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తలపై కొట్టడంతో కుట్లు పడ్డాయని అన్నాడు. మా తమ్ముడు కండీషన్ క్రిటికల్ గా ఉందని కన్నీరుమున్నీరయ్యాడు. నాకు చేతికి, కాలికి గాయాలయ్యాయని అన్నాడు. మా కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు. మాట్లాడుదామని పిలిచి ఇలా కొట్టారని తెలిపాడు. దీంతో పోలీసులు రిజ్వాన్‌ కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Abhishek Banerjee : జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతా: అభిషేక్ బెనర్జీ