NTV Telugu Site icon

Attack On KA Paul: కేఏ పాల్‌పై దాడి.. పోలీసులపై ఫైర్‌..

Ka Paul

Ka Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.. కేఏ పాల్‌ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు.. ఇక, ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు.. పాల్‌ చెంపపై కొట్టాడు.. ఇక, వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు.. అతడిని అడ్డుకున్నారు.. పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: KA Paul: కేసీఆర్, కేటీఆర్ నన్ను చంపడానికి చూస్తున్నారు

అయితే, పోలీసుల ఎదుటే టీఆర్ఎస్‌ శ్రేణులు నాపై దాడి చేశారని మండిపడ్డారు కేఏ పాల్.. పోలీసులు మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక టీఆర్ఎస్‌ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కేటీఆర్ జీతాలు ఇస్తున్నాడా..? ప్రభుత్వం నుండి ప్రజల సొమ్ము నుండి జీతాలు వస్తున్నాయా అంటూ ఫైర్‌ అయ్యారు పాల్. ఇక, తనపై దాడి చేయిండింది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆరేనని ఆరోపించారు కేఏ పాల్..