NTV Telugu Site icon

Malkajgiri Crime: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య

Nishitha Ded

Nishitha Ded

Malkajgiri Crime: అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. వచ్చిన బంధువులు పెళ్లింటి నుంచి ఇంకా వెళ్లలేదు.. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అంతలోనే ఘోరం. 16వ రోజుల పండక్కు పుట్టింటికి వచ్చిన పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.

పేట్ బషీరాబాద్ పియస్ పరిది చింతల్ బాపు నగర్ లో నిషిత కుటుంబం నివాసం ఉంటుంది. నిషితకు 23 సంవత్సరాలు. నిషితకు మేడ్చెల్ మండలం డబిల్ పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో సంబందం కుదిరింది. కుటుంబ సభ్యులు ఇద్దరిని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు చూడ ముచ్చటైన జంటఅని బంధువులు పొగడ్తలతో ముంచెత్తారు. ఇద్దరి వివాహానికి ముహూర్తం పెట్టారు. మే5న పెళ్ళికి ముహూర్తం ఖరారైంది. అందరి బంధువులకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో పెళ్లికి అందరు బంధువులు వధువు ఇంటికి వచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. వధువును తీసుకు అత్తింటి వారు ఇంటికి వెళ్లారు. 16వ రోజు పండక్కు పుట్టింటికి వచ్చిన నవ వధువు నిషిత కుటుంబ సభ్యులను చూసి చాలా ఆనందంగా గడిపింది. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ .. గదిలోకి వెళ్లిన నిషిత ఎంతసేపైన బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు కొట్టిన నిషిత నుంచి ఎలాంటి సమాధానం లేదు.

దీంతో తలుపులు బద్దలకొట్టి లోనికి వెళ్లి చూడగా.. నిషిత ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిషితను కిందికి దించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ హాసుపత్రికి కు తరలించారు. అత్తింటి వారే వేధించడం వలనే నిషిత ఆత్మహత్య చేసుకుందిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగి 16 రోజులుకూడా కాలేదని, అత్తింటికి వెళ్లి 16వ రోజు పండక్కి వచ్చిన నిషిత అసలు మాతో సరిగ్గా మాట్లాడలేదని తెలిపారు. ఆనందంగానే నిషిత ఉందని భావించామని, ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడించదని వాపోయారు. నిషిత ఆత్మహత్యకు కారకులైన అత్తింటి వారిపై కఠిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్తవారింటి నుంచి వచ్చి నిషిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అత్తింటి వేధింపులే నిషిత ఆత్మహత్యకు కారణమా? లేక నిషిత ఆత్మహత్యకు మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dog attacks: కుక్కల దాడిలో మరో బాలుడు మృతి.. హన్మకొండలో ఘటన

Show comments