తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈనేపథ్యంలో.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందన్నారు. రాష్ట్ర సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978-1983, 1983-84 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని తెలిపారు. ఇక 1945 నుంచి 48 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో.. సాయుధ పోరాటంలో మొట్టమొదట తుపాకీ పట్టిన మహిళ మల్లు స్వరాజ్యం. 1981 -2002 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని, సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారన్నారు.
ఈనేపథ్యంలో.. 1993లో అప్పటి ఏపీలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె నియోజకవర్గ ఎనలేని కృషిచేశారని.. 2022 మార్చి 19న 90 సంవత్సరాల వయసులో మరణించారు అన్నారు. ఇక కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ నియోజకవర్గం మాజీ సభ్యుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపం తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నది. అంతేకాకుండా.. జనార్దన్‌రెడ్డి 1972-78, 1978-1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని, 1959-71 వరకు హుజూరాబాద్ సమితి అధ్యక్షుడిగా పని చేశారన్నారు. ఇక జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. అయితే.. లెప్రా సొసైటీలో సభ్యుడైన ఆయన.. 1968 హిందూ కుష్ఠు నివారణ సమితిని స్థాపించి.. వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
అయితే.. 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం.. ఆరోగ్యం.. విద్య.. గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రజలకు సేవలందించారు. ఇక 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారని, సోషలిస్ట్ నేతగా గొప్ప పేరు సంపాదించారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన 2022, మార్చి 28న 87 సంవత్సరాల వయసులో మరణించారు అని తెలిపారు. కావున వారిద్దరి మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు సభ్యులంతా మౌనం పాటించిన అనంతరం సభ సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వాయిదా పడింది. ఆతరువాత బీఏసీ సమావేశం, అనంతరం బీఏసీ భేటీ జరుగనున్నది. ఈనేపథ్యంలో.. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? లాంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. ఇక సభకు సీఎం కేసీఆర్, మంత్రులతో పాటు సభ్యులు హాజరయ్యారు.
Etela Rajender: చరిత్రలో ఎప్పుడు 2-3 రోజులు సమావేశాలు జరగలే.. సీఎం అహంకారనికి నిదర్శనం..