Fake constable: ఆమె పేరు అశ్విని.. అందం అభినయం ఆమె సొంతం. అశ్విని ఇంటర్ వరకు చదువుకుంది. కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలని సరికొత్త ప్లాన్ వేసింది. ఆమె వేసిన ప్లాన్ మీరు వింటే ఇంటర్ లోనే ఈ అమ్మాయి ఇంత ఆరితేలిపోయిందా అని అనుకుంటారు. నిజం ఇలాంటి ఐడియాలో ఎలా వస్తాయో తెలియదు కానీ.. దాని వల్ల ఇప్పుడు చిల్ మూడ్ లో వున్నా తరువాత బాధపడేది మనమే అని మాత్రం మర్చిపోతుంటాము. అలాంటి పనే ఈ అశ్విని చేసింది. పోలీస్ కానిస్టేబుల్ గా అవతారం ఎత్తింది. ఏకంగా నకిలీ ఐడీ కార్డుతో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం సెంటర్ లో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది. అంతేకాదండోయ్ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరితో వివాహేత సంబంధంపెట్టుకుని వారితో బలవంతంగా దొంగతనాలు చేయించింది. చివరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కింది.
Read also: Public Grievance Redressal: ఆ విషయంలో తెలంగాణ టాప్.. ఏపీకి పదో స్థానం
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో నివాసం ఉంటున్న అశ్విని ఇంటర్ వరకు చదువుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఈ యువతి తన పేరును అశ్విని రెడ్డిగా మార్చుకోని తాను హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని నకిలీ ఐడీ కార్డు తయారు చేసింది. తర్వాత ఈసీఐఎల్‌లో ఉంటున్న రోహిత్ కిషోర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత అశ్విని మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండో ప్రేమికుడి సహాయంతో మొదటి భర్తను చంపేందుకు ప్రయత్నించింది. అది కాస్త ఫలించలేదు. అయితే డబ్బు కోసం ఈ ఇద్దరినీ దొంగతనం చేయాలని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో రోహిత్ దొంగతనాలకు పాల్పడి జైలు పాలయ్యాడు. దీంతో తన కథ ఎక్కడ బయటకు వస్తుందో అని భావించిన అశ్విని రెండో ప్రియుడితో ప్రస్తుతం అశ్విని మెహిదీపట్నంలో ఉంటుంది. అక్కడ అభిషేక్‌తో సహజీవనం కొనసాగిస్తోంది.
Read also: Ram Charan-Upasana: అద్భుతమైన 11 సంవత్సరాలు.. ఉపాసన కొణిదెల ట్వీట్ వైరల్!
నకిలీ పోలీస్ ఐడీ కార్డు తయారు చేసిన అశ్విని.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసింది. ఇందుకోసం యువకులు ఎంపిక చేసుకోని ర్యాపిడో వాహనాలను బుక్ చేసుకునే వారిపై టార్గెట్ చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన వలలో పడేసేది. అయితే ఎవరికి అనుమానం రాకుండా ర్యాపిడో వాహనాన్ని బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ యువకులను బయట వదిలి లోపలికి వెళ్లేది. కాసేపయ్యాక బయటికి వచ్చి పని అయిపోయింది సార్ అంటూ చెప్పేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామందికి బురిడీ కొట్టించి ఒక్కొక్కరి నుంచి వేల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇక్క ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనకు పెళ్లి కాలేదని అశ్విని మోసం చేసి వెళ్లిపోయిందని కొన్ని రోజుల క్రితం అభిషేక్ పోలీసులకు తెలిపడంతో రంగంలోకి దిగిన పోలీసులకు నిర్ఘాంత పోయారు. అశ్విని గురించి ఆరా తీయడంతో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులకు రంగంలోకి దిగి ఈ కిలేడిని అదుపులో తీసుకున్నారు. అయితే.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని అశ్విని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
Sea Products: భారీగా పెరిగిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు