తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లి అక్కడినించి తెలంగాణకు పెట్టుబడులు తేవడం ఐటీ మంత్రి కేటీఆర్ కే చెల్లింది. తాజాగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4వ తేదీన స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్ లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి రావాలంటూ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపారు నిర్వాహకులు. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు కు ఆహ్వానం అందడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
Read Also: CM KCR Medchal Meeting: తెలంగాణలో 24 గంటలు కరెంట్ పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ రాదు
అక్టోబర్ 4 వ తేదీన స్విడ్జర్లాండ్ రాజధాని జ్యూరిస్ (zurich) లో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం ఆహ్వానం పంపింది. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
Read Also:YSR Nethanna Nestam: ఏపీలో నేతన్నలకు శుభవార్త.. ఈనెల 23న అకౌంట్లలో రూ.24వేలు జమ
