NTV Telugu Site icon

Ashwathama Reddy: బీజేపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన అశ్వత్థామరెడ్డి

Ashwathama Reddy

Ashwathama Reddy

Ashwathama Reddy resigned: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా, వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. వనపర్తి అసెంబ్లీ స్థానం ఇచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో అనుజ్ఞ రెడ్డికి బీజేపీ అధిష్టానం కన్ఫార్మ్ చేసింది. దీంతో వనపర్తి అసెంబ్లీ స్థానం టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక, ఇవాళ అశ్వత్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

Read Also: Tesla: రెండేళ్లలో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా – భారత్ మధ్య కుదిరిన ఒప్పందం

ఇక, బీజేపీ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే కమలం పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు విజయశాంతి కూడా రాజీనామాలు చేశారు. దీంతో బలంగా కనిపించిన కాషాయం పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూసిన కమలం పార్టీకి బంగపాటు తప్పదని పార్టీ మారిన నేతలు అంటున్నారు.