Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- SIR, ఫార్మ్-7పై ఒవైసీ తీవ్ర అభ్యంతరాలు
- ముస్లిం ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ
- ఒడిశాలో తెలంగాణ తోలు వ్యాపారుల సమస్యపై సీఎస్‌కు విజ్ఞప్తి
- ఎల్‌నినో ప్రభావంపై సమగ్ర నివేదికకు సీఎస్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ముస్లిం ఓట్లను పథకం ప్రకారం తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎలక్షన్ కమిషన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల కమిషన్‌కు, భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియే సరైన విధానంలో జరగలేదని విమర్శించిన ఒవైసీ, ప్రస్తుత ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పేరుతో వెనుక తలుపు గుండా ఎన్ఆర్సీ (NRC) ని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఒడిశాలో తోలు వ్యాపారుల ఆవేదన.. సీఎం జోక్యానికి విజ్ఞప్తి
రాష్ట్రంలోని తోలు వ్యాపారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై కూడా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. తెలంగాణ నుంచి మేకలు, బర్రెలు, ఆవుల తోలును సేకరించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రవాణా చేస్తూ చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నారని, ప్రభుత్వానికి క్రమం తప్పకుండా 5 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ, గత ఆరు నెలలుగా ఒడిశాలో తెలంగాణకు చెందిన తోలు ట్రక్కులను అన్యాయంగా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాపారంపై దాదాపు 10,000 మంది జీవనం సాగిస్తున్నారని, లారీలను అడ్డుకోకుండా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ఒడిశా సీఎంతో మాట్లాడి తోలు వ్యాపారుల లారీలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ఎల్‌నినో కరువు పరిస్థితులపై సమగ్ర నివేదికకు సీఎస్ ఆదేశం
మరోవైపు, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావం, కరువు పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మాసాంతంలోగా ఎల్‌నినో ప్రభావం, పంట నష్టం, తాగు నీటి ఎద్దడి తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని సంబంధిత శాఖలకు సీఎస్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!