NTV Telugu Site icon

Asaduddin Owaisi: ఒవైసీ వ్యాఖ్యలపై మండి పడ్డ నిర్మలా సీతారామన్‌.. అసలేమన్నాడంటే?

Owaiisi

Owaiisi

Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నయన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ఒవైసీ ఓ బీఫ్‌ షాప్‌ గుండా వెళ్లి యజమానిని కలుసుకుని ప్రశంసించారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. “రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్. కైసే హో భాయ్? కట్టే రహో (రెహాన్ బీఫ్ షాప్ లాంగ్ లివ్. బ్రదర్ ఎలా ఉన్నారు? కసాయి పని చేస్తూ ఉండండి)” అని ఒవైసీ ఆ వీడియోలో బీఫ్ షాప్ యజమానికి చెప్పాడు ఒవైసీ.

Read Also: PM Modi: “టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా మార్చారు”.. బెంగళూర్ పరిస్థితికి కాంగ్రెస్ కారణం..

ఒవైసీ వ్యాఖ్యలపై సీతారామన్ స్పందిస్తూ.. అతని ప్రకటనలు “అసభ్యకరమైనవి” అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడంలో అతను నిపుణుడని నొక్కిచెప్పారు. ఒవైసీ ప్రకటనలు ఎంత అసభ్యకరంగా ఉన్నా.. ఆశ్చర్యం కలిగించవని, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అలాంటి ప్రకటనలు ఇవ్వడంలో నిష్ణాతుడని సీతారామన్ మీడియా సమావేశంలో అన్నారు.

ఒవైసీ 2004 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం, అతను హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్‌ కూడా ఉంది. మే 13న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.