Jawan Missing : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవీన్ రెండు రోజులుగా కనిపించకుండా పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘డ్యూటీకి వెళ్తున్నాను’’ అని చెబుతూ ఇంటి నుంచి బయలుదేరిన నవీన్, వాస్తవానికి డ్యూటీకి వెళ్లకుండా శ్రీశైలం వైపు కారులో వెళ్లిపోయినట్లు సమాచారం.
నవీన్ భార్య అనారోగ్యం కారణంగా ఐదు రోజుల క్రితం ఆర్మీ నుంచి సెలవు కోరగా, ఉన్నతాధికారులు లీవ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. అయినా ఆయన స్వంత గ్రామానికి వచ్చి భార్యకు శస్త్ర చికిత్స చేయించినట్లు తెలుస్తోంది. అనంతరం నిన్న హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమైన నవీన్, తన డ్యూటీకి హాజరు కాకుండా శ్రీశైలం వైపు కారులో వెళ్లినట్టు సమాచారం.
Pakistan: భారత్ అంటే తెలిసొచ్చింది.. ‘‘అణు బెదిరింపుల’’పై వెనక్కి తగ్గిన పాకిస్తాన్..
శ్రీశైలం డ్యాం సమీపంలోని ప్రాంతం నుంచి తన బంధువుకు ఫోన్ చేసిన నవీన్, “నా కోసం వెతకవద్దు… పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పినట్లు సమాచారం. అనంతరం డ్యాం సమీపంలోని కారు లోపల పురుగుల మందు బాటిల్, మొబైల్ ఫోన్ వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది.
ఈ ఘటనపై నవీన్ బంధువులు శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పరిస్థితి విషాదంగా మారింది. జవాన్ గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి సమాచారం కోసం సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇటువంటి సంఘటనలు ఆర్మీలో ఉన్న ఉద్యోగుల వ్యక్తిగత ఒత్తిడి, విధుల్లో తీవ్రపరంగా ఎదురయ్యే మానసిక ఒత్తిడి సమస్యలపై చర్చను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
US-China War: చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, జపాన్-ఆస్ట్రేలియాతో అమెరికా..
